'గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలి'
MNCL: గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ కోరారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలో నూతన సర్పంచ్ దంపతులను టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు మధు, ప్రధాన కార్యదర్శి రహీం, కోశాధికారి లక్ష్మణ్ పాల్గొన్నారు.