పిచ్చి కుక్క దాడిలో గాయాలు
CTR: పిచ్చికుక్క దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన సదుం మండలం చెరుకువారిపల్లెలో సోమవారం సాయంత్రం జరిగింది. ఇంటి వద్ద కూర్చొని ఉన్న మస్తాన్ పై పిచ్చికుక్క దాడి చేయడంతో అతను గాయపడ్డాడు. గాయపడ్డ బాలుడిని సదుం సీహెచ్సీకి వైద్యం కోసం తరలించారు. కుక్కల బెడద అరికట్టాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు.