సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన స్పీకర్
AKP: నర్సీపట్నంలోని స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. 22 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 7,28,729 ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలిచే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటుందని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.