ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు

NRML: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఈరోజు నర్సాపూర్ రైతు వేదికలో నందన్, బామ్ని(బి) గ్రామాల రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి, ఉన్నతాధికారులు పాల్గొని NMNF పథకం కింద ఎంపికైన 125 మంది రైతులకు మార్గదర్శనం చేశారు. క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రామ్ చందర్ రావు ఉన్నారు.