నేడు పాఠశాలలకు సెలవు

నేడు పాఠశాలలకు సెలవు

MDK: గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర పాఠశాలలకు నేడు సెలవును ప్రకటించారు. ఈ విషయాన్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు తక్షణం సెలవు ప్రకటించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు.