'కొత్తపేట రామాపురం అభివృద్ధి జగన్ పాలనలోనే'
అన్నమయ్య: జగన్ హయాంలోనే రాయచోటి పట్టణంలోని కొత్తపేట రామాపురం ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందిందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఆ ప్రాంత యువతతో మమేకమై అభివృద్ధి పనులపై చర్చించారు. జగన్ హయంలోనే హైస్కూల్ అభివృద్ధి, అర్బన్ హెల్త్ సెంటర్, డ్రైనేజీ నిర్మాణం వంటి పలు పనులు జరిగాయని యువతకు గుర్తు చేశారు.