పెండింగ్ మెస్ బిల్లును వెంటనే విడుదల చేయాలి: SFI
BHPL: జిల్లాలోని SC, ST, BC హాస్టల్స్‌లో పెండింగ్‌లో ఉన్న మెస్, కాస్మోటిక్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని SFI జిల్లా అధ్యక్షుడు స్మరణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇవాళ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సౌకర్యాలు అందకపోవడంతో విద్యా రంగ సమస్యలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఈ మేరకు వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు.