జర్నలిస్ట్ పై పెట్టిన కేసు నెత్తివేయాలని ఆందోళన

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సోమవారం టియుడబ్ల్యూజే 143 యూనియన్ నాయకులు ఖమ్మం ప్రముఖ న్యూస్ విలేఖరి పై అక్రమ కేసును నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిఆర్ లెనిన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు రహదారిపై ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్షం రాజ్ కుమార్, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.