ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50లక్షల విరాళం

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50లక్షల విరాళం

TPT: చెన్నైకి చెందిన పొన్ ప్యూర్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50లక్షలు విరాళంగా అందించింది. తిరుమలలో అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి ఆ సంస్థ సీఎండీ ఎం. పొన్నుస్వామి విరాళం చెక్కును అందించారు. ప్రాణదానం, శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి ఈ నగదు వినియోగించాలని దాత కోరారు.