పుంగనూరులో ‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’

పుంగనూరులో ‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’

CTR: పుంగనూరులోని 28, 29, వార్డుల్లో శనివారం మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా బాబు షూరిటీ - మోసం గ్యారంటీ నిర్వహించారు. ముందుగా హనుమంతరాయ దీన్నె ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ప్రతి గడపగడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మభ్యపెడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.