ఇంటింటి ప్రచారంలో కాటా సుధారాణి బిజీ

ఇంటింటి ప్రచారంలో కాటా సుధారాణి బిజీ

SRD: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న విక్రమ్ గౌడ్ గెలుపుకై జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధారాణి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికై సర్పంచ్‌గా పోటీ చేస్తున్న విక్రమ్ గౌడ్‌ను గెలిపించాలని కోరారు. గ్రామంలో మహిళా కార్యకర్తలతో గడపగడప ప్రచారంలో పాల్గొన్నారు.