బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పండుగల తేదీల నిర్ణయం

NLG: దేవరకొండ నియోజకవర్గం బ్రాహ్మణ సంఘ సమావేశం పెద్దమునిగల్‌లో కుర్మేటి ఉమాశంకర్ కుర్మేటి రమా శంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కుర్మేటి రవిప్రసాద్ శర్మ మాట్లాడుతూ.. ప్రజలంతా వరలక్ష్మి వ్రతాన్ని మూడవ శుక్రవారం అయిన ఈనెల 8న జరుపుకోవాలని వినాయక చవితిని ఈనెల 27న జరుపుకోవాలని,సెప్టెంబర్ 5న గణేష్ నిమజ్జనం నిర్వహించాలన్నారు.