బోథ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే
ADB: బోథ్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 77 గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే అనిల్ చారు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల పోరాటంతో స్వాతంత్రం సాధించి 1950 జనవరి 26 న మన రాజ్యాంగం అమలులోకి రావడంతో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.