ఇందిరమ్మ ఇళ్ల పనులకు కార్పొరేటర్ శంకుస్థాపన

KMM: ఖమ్మం నగరంలోని 8వ డివిజన్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ లకావత్ సైదులు సోమవారం శంకుస్థాపన చేశారు. సకాలంలో ఇళ్లు నిర్మాణ పనులు చేపడితే విడత వారీగా నగదు జమ అవుతుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఇళ్లు ఇస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. పనులు నాణ్యతగా చేపట్టాలని మేస్త్రీకి సూచించారు.