'భగీరథుని స్ఫూర్తిగా తీసుకోవాలి'

'భగీరథుని స్ఫూర్తిగా తీసుకోవాలి'

WNP: భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకొని బహుజనుల అభివృద్ధికై కృషి చేయాలని ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ పిలుపునిచ్చారు. మహనీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో ఆయన జయంతి ఆదివారం వనపర్తిలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజారాం మాట్లాడుతూ.. కఠోరమైన తపస్సు చేసి దివి నుండి భువికి గంగను రప్పించిన భగీరథుడు మహనీయుడు అని అన్నారు.