ఈ ఏడాది మిర్చి సాగు తక్కువే..!

BDK: పినపాక మండలం వ్యాప్తంగా ఈ సంవత్సరం మిరప సాగు తగ్గిందనే చెప్పాలి. పోయిన ఏడాది మిర్చికి ఆశించిన ధర రాకపోవడంతో రైతన్నలు సాగు చేసే విస్తీర్ణం తగ్గించారనే చెప్పొచ్చు. ఈ పంటను నమ్ముకున్న రైతులకు రూ. లక్షల నష్టం వచ్చింది. ఓ వైపు మిర్చి గింజలు పెద్దగా అమ్ముడు పోలేదని వ్యాపారస్థులు చెబుతున్నారు. ఈసారి ధర ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.