రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సిద్దమైన జిందాల్ యాజమాన్యం

VZM: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు జిందాల్ యాజమాన్యం రంగం సిద్ధం చేస్తుందని ఏపీ రైతు సంఘం విజయనగరం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ శుక్రవారం ఆరోపించారు. ఎస్.కోట మండలం బొడ్డవరలో గిరిజనులు నేటికి 61 రోజులగా ధర్నా చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు నేటికీ స్పందించకపోవడంపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు.