VIDEO: అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు..!
KDP: సిద్ధవటం గ్రామ శివారులోని ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద శుక్రవారం రాత్రి ఫారెస్ట్ రేంజ్ అధికారిణి కళావతి వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. కడప DFO ప్రణీత్ కుమార్ ఆదేశాలతో కొండ సంపద తరలిపోకుండా ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అట్లూరు, సిద్ధవటం, ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా పాల్పడితే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.