నిప్పు అంటుకుని ఇళ్ళు దగ్ధం
ASF: బెజ్జూర్ మండలంలో ఇంటికి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని దగ్ధమైంది. పెద్ద సిద్ధాపూర్ సిడం రవికి చెందిన ఇంట్లో గురువారం అర్ధరాత్రి మంటలు చెలరేగి ఇల్లు అంటుకున్నట్లు బాధితులు తెలిపారు. ఇంట్లో దాచుకున్న రూ.50వేల నగదు, బంగారం, వరి ధాన్యం, ఇతర సామాగ్రి కాలిపోయాయి. సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.