డోప్ టెస్టులో విఫలం.. సీమాపై నిషేధం

డోప్ టెస్టులో విఫలం.. సీమాపై నిషేధం

ఆసియా గేమ్స్‌ విజేత, స్టార్‌ డిస్కస్‌ త్రో అథ్లెట్ సీమా పునియాకు షాక్ తగిలింది. డోపింగ్ టెస్టులో విఫలమైన ఆమెపై 16 నెలల నిషేధం విధిస్తూ నాడా నిర్ణయం తీసుకుంది. 42 ఏళ్ల పునియాపై సస్పెన్షన్‌ నవంబర్ 10 నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. అయితే, పునియా ఏ ఉత్ప్రేరకం వాడిందో తెలియజేయలేదు. ఇది ఆమె కెరీర్‌లో రెండోసారి నిషేధం ఎదుర్కోవడం గమనార్హం.