అమరావతి పనులపై సమీక్ష.. నారాయణ ఆదేశాలు

అమరావతి పనులపై సమీక్ష.. నారాయణ ఆదేశాలు

AP: అమరావతి అభివృద్ధి వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఇవాళ జరిగిన సమీక్షలో.. పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను మంత్రి నారాయణ ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం 4026 ఇళ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాణాలు పూర్తయిన టవర్ల వద్ద మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.