మేడారం ఉప సర్పంచ్‌గా రవికుమార్ ఏకగ్రీవం

మేడారం ఉప సర్పంచ్‌గా రవికుమార్ ఏకగ్రీవం

PDPL: ధర్మారం మండలం మేడారం గ్రామ ఉప సర్పంచ్‌గా అరిగే రవికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం గ్రామంలో 14 మంది వార్డు సభ్యులు ఉండగా ఏడవ వార్డు సభ్యుడు రవికుమార్‌ను సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం పట్ల స్థానిక నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.