'రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు'
KNR: చొప్పదండి పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం మూడో విడత రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా 'అరైవ్ అండ్ అలైవ్' కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రోడ్లపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లను గుర్తించడానికి వీలుగా రోడ్డుపై తెల్లటి లైన్లు ఏర్పాటు చేశారు. ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అప్రమత్తంగా వాహనాలు నడపాలని వారు సూచించారు.