నేడు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవం

NDL: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకం ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రారంభిస్తారు. శనివారం నందికోట్కూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నందు ఉదయం 10 గంటలకు రైతన్నలతో కలిసి అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రైతులతో ముఖాముఖి ఆయ్యే కార్యక్రమం ఉంటుంది. వ్యవసాయ అధికారులు, రైతన్నలు, యార్డు పరిపాలకులు పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు.