పాలిటెక్నిక్ కళాశాలో తక్షణ ప్రవేశాలు

NLG: నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆయా కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు, తక్షణ ప్రవేశాలు చేపడుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ నరసింహరావు బుధవారం పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 7 వరకు కళాశాల కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను స్వీకరించి తగిన ధ్రువపత్రాలను అందజేయాలని కోరారు.