పంత్‌తో పోటీపై స్పందించిన జురెల్

పంత్‌తో పోటీపై స్పందించిన జురెల్

భారత్-దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ హోరాహోరీగా ఉండబోతుందని ధ్రువ్ జురెల్ పేర్కొన్నాడు. రెండు జట్లలోనూ మంచి ఆటగాళ్లు ఉన్నారని తెలిపాడు. బౌలింగ్‌లో దక్షిణాఫ్రికాకు రబాడ, జాన్సెన్ ఉంటే.. తమకు బుమ్రా, సిరాజ్ ఉన్నారని వ్యాఖ్యానించాడు. అలాగే తనకు పంత్ నుంచి ఎలాంటి పోటీ లేదని స్పష్టం చేశాడు. ఇద్దరం భారత్ తరఫున ఆడుతున్నామని, జట్టు గెలుపే తమ ఏకైక లక్ష్యం అని పేర్కొన్నాడు.