పేకాట శిబిరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్
KKD: జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో రహస్యంగా పేకాట నిర్వహిస్తున్నట్లు CI బి.తిరుపతిరావుకు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం ఎస్సై రఘునాథరావు సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 10వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.