పోలీసులకు సీసీ కెమెరాలు అందజేసిన మెకానిక్ సంఘం
VZM: దొంగతనాలు జరగకుండా ముందుస్తు చర్యలలో భాగంగా ఎస్.కోట పట్టణ మెకానిక్ సంఘం ఆధ్వర్యంలో రెండు సీసీ కెమెరాలను పట్టణ సీఐ నారాయణమూర్తి గురువారం అందజేశారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ.. పట్టణంలో దొంగతనాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని సీఐ పేర్కొన్నారు. మెకానిక్ సంఘం సేవా దృక్పథం కలిగి ఉండడం హర్షణీయమన్నారు.