VIDEO: భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు: సీపీఐ
SDPT భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ అన్నారు. సోమవారం భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా చేర్యాలలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేవలం 23 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి, దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప వీరుడని కొనియాడారు.