ఆ బంగ్లాను ఖాళీ చేసే ప్రసక్తే లేదు: ఆర్జేడీ

ఆ బంగ్లాను ఖాళీ చేసే ప్రసక్తే లేదు: ఆర్జేడీ

బీహార్‌ మాజీ సీఎం, లాలూప్రసాద్‌ యాదవ్‌ సతీమణి రబ్రీ దేవీ రెండు దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసే ప్రసక్తే లేదని ఆర్జేడీ స్పష్టం చేసింది. వేరే నివాసంలోకి మారాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన మరుసటి రోజు ఈ మేరకు స్పందించింది. లాలూకు వ్యతిరేకంగా అధికార ఎన్డీయే దురుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందని మంగనీ లాల్‌ ఆరోపించారు.