పేకాట స్థావరంపై దాడి.. 12 మంది అరెస్ట్
PLD: కారంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒప్పిచర్ల శివారులో సాగుతున్న పేకాట స్థావరంపై సోమవారం రాత్రి నరసరావుపేట ప్రత్యేక పోలీసు బృందం మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1.90 లక్షల నగదుతో పాటు 9 బైకులు, 14 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.