కలెక్టర్ మాటకు విలువ లేదా..?

అన్నమయ్య: బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కలెక్టర్ బొప్పాయి వ్యాపారులు, దళారులతో చర్చలు జరిపి ఆదేశించినా రైతులకు మేలు జరగడంలేదని చిట్వేలు CITU జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ విమర్శించారు. పొలంలో బొప్పాయి మాగిపోతుండడంతో దళారులు చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అధికారులు స్పందించి దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.