గోదావరి నది ఉధృతి పరిశీలించిన మంత్రి అడ్లూరి

JGL: ఎడతెరిపిలేకుండా ఎగువన కురుస్తున్న భారీ వానలు, ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల కారణంగా ధర్మపురి తీరప్రాంత గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి వరద ఉధృతిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి - గోదావరి ఉధృతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు తెలిపారు.