వేసవిలో నీటి ఎద్దడి నివారణకే నీటి తొట్టెల నిర్మాణం

వేసవిలో నీటి ఎద్దడి నివారణకే నీటి తొట్టెల నిర్మాణం

అన్నమయ్య: వేసవిలో జీవాలకు నీటి ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా నీటి తొట్టెలు నిర్మించుకునే సౌకర్యం కల్పించిందని MPDO మోహన్ తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. పశువులు, గొర్రెలు, అడవి జంతువుల నీటి కోసం రైతులు గ్రామాలలో 5,200 లీటర్ల సామర్థ్యంతో నీటి తొట్టెలు నిర్మించుకోవచ్చని అన్నారు. ఒక్కో నీటి తొట్టి నిర్మాణానికి రూ. 33 వేలు అందిస్తుందన్నారు.