‘నిరాశలో కాంగ్రెస్ దేశంపైనే దాడి చేస్తోంది’
ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో యూత్ కాంగ్రెస్ నేతల 'అర్ధనగ్న' నిరసనపై PM మోదీ మండిపడ్డారు. ఓటమి నిరాశలో ఉన్న కాంగ్రెస్.. దుస్తులు చింపుకోవడం తప్ప మరేమీ చేయలేకపోతోందని ఎద్దేవా చేశారు. బాధ్యతాయుత విపక్షంగా విఫలమై, ఏకంగా దేశంపైనే దాడికి దిగుతోందని విమర్శించారు. అసోం ప్రజల వలె రానున్న ఎన్నికల్లో ప్రతి రాష్ట్రం కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతుందని ప్రధాని హెచ్చరించారు.