నేడు అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

నేడు అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

HNK: అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యదర్శి సారంగపాణి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో అండర్-14, 16, 18, 20 బాలబాలికలకు వివిధ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న అథ్లెట్లు ఉదయం 10 గంటలకు జేఎన్ స్టేడియంలో రిపోర్టు చేయాలని సూచించారు.