BIG ALERT: పెరగనున్న ఎండల తీవ్రత

BIG ALERT: పెరగనున్న ఎండల తీవ్రత

TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాల్లోనూ 37 నుంచి 39 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. హైదరాబాద్‌లో 36 నుంచి 37 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. అన్ని జిల్లాల్లో నిన్న 35 నుంచి 36.4 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.