నేటి నుంచి డిగ్రీ కాలేజీలకు మెమోలు పంపిణీ

NLG: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలలకు బుధవారం నుంచి విద్యార్థుల మెమోలను అందజేస్తామని యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి ఉపేందర్ రెడ్డి తెలిపారు. పీజీ కౌన్సిలింగ్‌కు వెళ్లే విద్యార్థులకు మెమోల గురించి ఆందోళన అవసరం లేదన్నారు. కౌన్సిలింగ్‌కు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు.