'వరిలో సస్యరక్షణ చర్యలు పాటించాలి'
KMM: కూసుమంచి మండలం భగవత్ వీడులోని వరి పొలాలను ఏవో రామడుగు వాణి పరిశీలించారు. వరిలో కాండం తొలిచే పురుగు ఉధృతిని గమనించి దాని నివారణకు రైతులకు పలు సూచనలు చేశారు. వరిలో కాండం తొలిచే పురుగు సోకినప్పుడు పొట్టదశలో ఉన్న పంటలో గింజలు తాలుగా మారుతాయని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయాధికారుల సూచనలతో సస్యరక్షణ చర్యలు పాటించి అధిక లాభాలు పొందాలని సూచించారు.