VIDEO: పీఎసీఎస్ కార్యాలయంలో రైతుల ఆందోళన

WNP: ఆత్మకూరు PACS కార్యాలయంలో యూరియా కొరతతో రైతులు ఆందోళన చేపట్టారు. టోకెన్లు ఇచ్చి 4-5 రోజులు గడిచినా యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతులు సిబ్బందితో వాదనకు దిగారు. సరిపడా యూరియా అందిస్తామని హామీ ఇచ్చినా, ఆచరణలో కొరత ఏర్పడటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వాలు మారినా రైతులకు తిప్పలు తప్పట్లే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది.