తేలప్రోలు -పెద్ద అవుటపల్లి వరకు క్రైస్తవుల పాదయాత్ర
కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలు నుంచి పెద్ద అవుటపల్లి వరకు ఆర్‌సీయం చర్చ్ ఆధ్వర్యంలో క్రైస్తవులు పవిత్ర యాత్రను మంగళవారం నిర్వహించారు. తపస్సు కాలంలో యేసు క్రీస్తు శ్రమలను గుర్తు చేసుకొని ఈ పాదయాత్ర నిర్వహించినట్లు ఫాదర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని క్రీస్తు పాటలు పాడుతూ, జపమాలలు జపిస్తూ ముందుకు సాగారు.