'ధవళేశ్వరం గేట్ల ప్రక్షాళనకు రూ.138 కోట్లు మంజూరు'
AP: ధవళేశ్వరం గేట్లను ప్రక్షాళన చేయాలని CM చంద్రబాబు ఆదేశించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ధవళేశ్వరం ప్రాజెక్టుకు కొత్త గేట్ల ఏర్పాటుకు టెండర్లకు పిలిచామన్నారు. దీని కోసం రూ.138 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. వచ్చే సీజన్‌లోపు ధవళేశ్వరం గేట్లు ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. గోరకల్లు రిజర్వాయర్ ప్రమాదంలో ఉన్నా.. గత ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.