VIDEO: కోతుల దాడిలో వ్యక్తికి గాయాలు
MDK: పట్టణంలోని కుమ్మరిగడ్డ వీధికి చెందిన కుమ్మరి సంతోష్ ఎంసీహెచ్ ఆసుపత్రికి వెళ్తుండగా, ఫ్యాక్టరీ హనుమాన్ దేవాలయం సమీపంలో కోతుల గుంపు దాడి చేసింది. దీంతో సంతోష్ కు చెయ్యి విరిగినట్లు తెలిపారు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో కోతుల బెడద నుంచి వారిని కాపాడేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు.