యాదగిరిగుట్ట అయ్యప్ప ఆలయ పుష్కర వార్షికోత్సవ వేడుకలు

యాదగిరిగుట్ట అయ్యప్ప ఆలయ పుష్కర వార్షికోత్సవ వేడుకలు

యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ అయ్యప్పస్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఉదయం మహాగణపతి హోమం, నవ కలశాభిషేకం జరిగాయి. బ్రహ్మశ్రీ ప్రదీప్ కుమార్ తాంత్రి వారిచే శాస్త్రోక్తంగా పూజలు సాగుతున్నాయి. సాయంత్రం లలిత సహస్ర పారాయణం నిర్వహించనున్నారు. రేపు గణపతి హోమం, సహస్ర కలశాభిషేకం, పడిపూజ, అన్నదానం ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.