మద్యం మత్తులో ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి వ్యక్తి మృతి

ASF: ఆసిఫాబాద్ మండలం వావుదాం గ్రామానికి చెందిన కోరెంగ విషంరావ్(35) మంగళవారం రాత్రి 10:45 గంటల సమయంలో ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి పూర్తిగా కాలిపోయాడు. చికిత్స కోసం ఆసిఫాబాద్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. మద్యం మత్తులో ఇలా చేసినట్లుగా స్థానికులు తెలిపారు.