VIDEO: నూతన వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

HNK: పరకాల మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాహనాలను స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మంగళవారం కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. డోజర్, ఐదు చెత్త సేకరణ వాహనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో పట్టణాభివృద్ధి కొనసాగుతుందన్నారు. స్వచ్ఛ పట్టణంగా ఉండేందుకు ప్రజలు సహకరించాలని సూచించారు.