అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌కి నామినేషన్..!
NGKL: బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కమతం నందిని శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈమె ముగ్గురు పిల్లలు అమెరికాలో స్థిరపడగా, ఆరేళ్ల నుంచి వారి వద్దనే ఉంటున్నారు. అయితే, సర్పంచ్ స్థానాన్ని జనరల్‌కి కేటాయించడంతో ఆమె అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ పదవికి నామపత్రాలు సమర్పించారు.