వ్యవసాయరంగాన్ని కేసీఆర్ పండగలా చేశారు: మాజీ మంత్రి

వ్యవసాయరంగాన్ని కేసీఆర్ పండగలా చేశారు: మాజీ మంత్రి

WNP: తెలంగాణలో జలసిరులు పారించి, వ్యవసాయ రంగాన్ని మాజీ సీఎం కేసీఆర్ పండగలా చేశారని మంగళవారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ వ్యవసాయాన్ని కేసీఆర్ అగ్రభాగాన నిలబెట్టారని, పల్లెలు తిరిగి కళకళలాడేలా చేశారని ఆయన మీడియాకు తెలిపారు. వ్యక్తిగత పనుల కోసం అపాయింట్‌మెంట్ దొరకలేదని, పని కాలేదని కొందరు కేసీఆర్‌పై విషం చిమ్మారని ఆయన ఆరోపించారు.