నేడు వేంపల్లిలో మండల సర్వ సభ్య సమావేశం

నేడు వేంపల్లిలో మండల సర్వ సభ్య సమావేశం

KDP: తన కార్యాలయంలోని YSR సభా భవనంలో మంగళవారం సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు వేంపల్లి ఎంపీడీవో కుళాయమ్మ తెలిపారు. ఎంపీపీ గాయత్రి అధ్యక్షతన వహిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తాగు నీరు, వ్యవసాయం, ఉపాధి హామీ, హౌసింగ్ ఇలా అన్ని ప్రభుత్వ శాఖలపై చర్చ జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి వేంపల్లి మండల ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు హాజరు కావాలన్నారు.