ఇందిరమ్మ కాలనీ గ్రామ సర్పంచ్‌ అభ్యర్థిగా బైరి రమేష్

ఇందిరమ్మ కాలనీ గ్రామ సర్పంచ్‌ అభ్యర్థిగా బైరి రమేష్

SRCL: తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామ సర్పంచ్‌గా తనను గెలిపిస్తే, గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బైరి రమేష్ అన్నారు. గ్రామంలో ప్రతి ఆడపడుచు పెళ్లికి రూ. 5000 ఇస్తానని, అవసరం ఉన్న చోట్ల బోర్లు వేయించి, మంచి నీటికి శాశ్వత పరిష్కారం కల్పిస్తానన్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి గ్రామ సేవకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.